కెకె కోసం కాంగ్రెసు తెలంగాణ ఎంపీల బ్యాటింగ్

పార్టీ కోసమే కేశవరావు తెలంగాణవాదాన్ని బలంగా వినిపించారని వారు పార్టీ అధిష్టానానికి విన్నవించనున్నారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు కోర్ కమిటీ సభ్యులను, ముఖ్యమంత్రిని, పిసిసి అధ్యక్షుడిని కలిసి కేశవరావును తిరిగి రాజ్యసభకు నామినేట్ చేయాలని కోరుతామని వారు చెప్పారు. కేశవరావు పార్టీకి విధేయుడని, మేధావి అని, అందువల్ల రాజ్యసభలో కెకె ఉండాలని మందా జగన్నాథం అన్నారు. తమపై ఎంత ఒత్తిడి ఉన్నా, పార్టీ అధిష్టానాన్ని ఇబ్బంది పెట్టి తెలంగాణ ప్రజల మనోభావాలను వినిపించామని ఆయన చెప్పారు. తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిది తెలంగాణపై రెండు కళ్ల సిద్ధాంతమని రాజయ్య అన్నారు.












Click it and Unblock the Notifications