వైయస్ జగన్ వర్గానిది గుండాయిజం: విహెచ్ ఫైర్

పార్లమెంటు సభ్యురాలు కనిమొళి అరెస్టయిన సందర్భంగా అప్పట్లో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కరుణానిధి సైతం మౌనంగా ఉండిపోయారని గుర్తు చేశారు. ఒకవేళ సీబీఐ అరెస్టు చేస్తే జగన్ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలన్నారు. జగన్ వర్గీయుల హెచ్చరికలు బ్లాక్ మెయిల్‌లో భాగమని ఆయన ఆయన అన్నారు.
వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన వర్గానికి చెందిన 40 మందికి ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించుకోవడం వల్లే ప్రస్తుతం ఈ సమస్య దాపురించిందన్నారు. జగన్‌వర్గానికి చెందిన 17 మంది ఎమ్మెల్యేలపై వేటు వేయడంలో జాప్యాన్ని గురించి మీడియా ప్రశ్నించగా అది స్పీకర్ పరిధిలోని అంశమన్నారు. ఈ స్థానాలకు జరగబోయే ఉప ఎన్నికల్లో అవినీతికి, నీతికి మధ్య భారీ పోరాటం జరుగబోతోందని ఆయన అభివర్ణించారు.












Click it and Unblock the Notifications