409 సెక్షన్ నాకు వర్తించదు: విజయ సాయి రెడ్డి వాదన

Vijaya sai Reddy
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో తనకు 409వ సెక్షన్ వర్తించదని విజయ సాయి రెడ్డి నాంపల్లి కోర్టులో వాదించారు. జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై ఆయన తరఫు న్యాయవాది సునీల్ కుమార్ సోమవారం వాదనలు వినించారు. తనది చార్టెడ్ అకౌంటెంట్ పాత్రమేనని, అందువల్ల తనకు 409వ సెక్షన్ వర్తించదని విజయసాయి రెడ్డి అన్నారు. తనను అరెస్టు చేసి 60 రోజులు దాటినందున బెయిల్ మంజూరు చేయాలని ఆయన కోర్టును కోరారు.

ఇదిలా వుంటే, ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో ఎంజిఎఫ్ సిఇవో శ్రీకాంత్ జోషీ సోమవారం సిబిఐ ఎదుట హాజరయ్యారు. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు ఆయనను సిబిఐ అధికారులు సోమవారంనుంచి ఐదు రోజుల పాటు విచారించనున్నారు. ఎమ్మార్ విల్లాల విక్రయాల్లో ఎంజిఎఫ్ సిఇవోగా శ్రీకాంత్ జోషీ అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై సిబిఐ విచారణ జరుపుతోంది.

ఇతర నిందితులు శ్రవణ్ గుప్తా, ఎమ్మార్ అధికారి విజయ రాఘవలతో కలిసి శ్రీకాంత్ జోషి కుట్ర చేసి ఎపిఐఐసిని మోసం చేశారని సిబిఐ అభియోగాలు మోపింది. అయితే, ఈ అభియోగాలను సవాల్ చేస్తూు శ్రీకాంత్ జోషీ నాంపల్లి కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై విచారణను కోర్టు ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+