యుపిలో పొత్తుల కోసం ఎత్తులు, మాయ అవుట్

కాంగ్రెసు పార్టీ మాయావతి నేతృత్వంలోని బిఎస్పీతో జత కడుతుందా, సమాజ్‌వాదీ పార్టీ పక్కన చేరుతుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సమాజ్‌వాదీ పార్టీతో కలిసి కాంగ్రెసు పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చునని ఇప్పటి వరకు అనుకుంటూ వచ్చారు. అయితే, కేంద్ర మంత్రి, కాంగ్రెసు సీనియర్ నాయకుడు బేణీ ప్రసాద్ ఆదివారం బాంబు పేల్చారు. మాయావతితో తాము జత కట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు.
ములాయం సింగ్ యాదవ్‌తో ఏర్పడిన విభేదాలతో బేణీ ప్రసాద్ 2007లో ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెసులో చేరారు. తాము ఎస్పీ కన్నా బిఎస్పీకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని ఆయన అన్నారు. ఎస్పీ గూండాల పార్టీ అని, బిఎస్పీ దళితుల పార్టీ అని, అందువల్ల తాము బిఎస్పీతో కలిసి పనిచేయడానికే ప్రాధాన్యం ఇస్తామని ఆనయ అన్నారు. అయితే, బేణీ ప్రసాద్ ప్రకటనను ఆయన వ్యక్తిగత అభిప్రాయంగా కాంగ్రెసు పార్టీ కొట్టి పారేసింది.
తమకు మెజారిటీ వస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తామని, లేదంటే ప్రతిపక్షంలో కూర్చుంటామని యుపి కాంగ్రెసు కమిటీ అధ్యక్షురాలు రీటా బహుగుణ అన్నారు. కాగా, బిజెపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మాయావతి ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications