యూత్ ఐకాన్‌గా...: రాహుల్ గాంధీని దాటేసిన అఖిలేష్!

యుపి ఓటర్లను రాహుల్ కంటే అఖిలేష్ బాగా ప్రభావితం చేశారని అంటున్నారు. రాహుల్‌తో పోలిస్తే బహిరంగ సభల్లో అఖిలేష్ మాట్లాడింది తక్కువే అయినప్పటికీ బాగానే ప్రభావితం చేశారట. అఖిలేష్ సభల్లో కంటే ర్యాలీలలో ఎక్కువగా పాల్గొని యువతను ఆకట్టుకున్నారు. ఇక కాంగ్రెసులో రాహుల్, ప్రియాంక గాంధీ, రాబర్డ్ వాద్రా ముగ్గురూ ప్రచారానికి వచ్చి అంతా కంగాళీ చేశారని అంటున్నారు. ఎస్పీ తరఫున మాత్రం అఖిలేష్ ఒక్కరే పాల్గొన్నారు. ఉపాధి హామీతో ఆకట్టుకున్న అఖిలేష్ అదే సమయంలో కాబోయే హైటెక్ సిఎంగా ఫోకస్ అయ్యారు. ప్రజలు కూడా రాహుల్ గాంధీని నాన్ లోకల్‌గా అఖిలేష్‌ను లోకల్ లీడర్‌గా చూశారని అంటున్నారు.












Click it and Unblock the Notifications