తాగుబోతు కెసిఆర్ ఏం మాట్లాడ్తారో: మోత్కుపల్లి

తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని తిట్టి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ నుంచి, ప్రధాని మన్మోహన్ సింగ్ నుంచి డబ్బులు తెచ్చుకోవడం కెసిఆర్ మానుకోవాలని ఆయన అన్నారు. 11 ఏళ్లుగా కెసిఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. కెసిఆర్ చెసిన నిరాహారదీక్ష నాటకమని ఆయన అన్నారు. సకల జనుల సమ్మెను కెసిఆర్ సకల సంపదగా మార్చుకున్నారని ఆయన అన్నారు. పదవుల కోసం, సంపద కోసం పార్టీలు మారే వారికి ఉప ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారని ఆయన అన్నారు.
తెలంగాణలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో తమ పార్టీ గెలుస్తుందని మరో తెలంగాణ ప్రాంత శానససభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావు విడిగా మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణలోని ఆరు స్థానాల్లో ప్రచారం చేస్తారని ఆయన చెప్పారు. తెరాస రాజీనామాలతో తెలంగాణ రాదని తేలిపోయిందని ఆయన అన్నారు. తాము తెరాస కార్యకర్తలను గుండాలతో కొట్టిస్తున్నట్లు తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications