రామోజీ రావుపై విరుచుకుపడిన శోభా నాగిరెడ్డి

Shobha Nagi Reddy
హైదరాబాద్: ఈనాడు దినపత్రిక అధినేత రామోజీ రావుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బయటకు వచ్చి ఓ పార్టీకి ఓటేయాలని రామోజీ రావు బహిరంగంగా చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. లేదంటే ఒక పార్టీ పెట్టుకోవాలని ఆమె సలహా ఇచ్చారు. తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై అసత్య ప్రచారం మానుకోవాలని ఆమె హెచ్చరించారు. జగన్ బ్యానర్ ఐటమ్ లేకుంటే ఈనాడు దినపత్రిక అమ్ముడు పోదన్నట్లుగా జగన్ గురించి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ఆమె గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

రామోజీ వంద రూపాయల షేర్లను ఐదు వేలకు అమ్మినప్పుడు లేనిది జనగ్ షేర్ల గురించి మాట్లాడడం ఎంత వరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సాక్షి దినపత్రిక, టీవీ చూడొద్దని ప్రకటనలు చేస్తున్నారని ఆమె అన్నారు. కోవూరు ఉప ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతనైనా ఈ దుష్ప్రచారాలకు తెర పడుతుందని ఆమె అన్నారు. లేదంటే గట్టిగా బుద్ధి చెప్తారని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+