మైసూరులో అఖిలేష్ యాదవ్ ముక్కు పగిలింది

ఇక్కడ విద్యార్థిగా ఉన్నప్పుడు అఖిలేష్ ముక్కుకు దెబ్బ తగలిందని గుర్తుంది గానీ అది ఎలా జరిగిందో గుర్తు లేదని వైస్ ప్రిన్సిపాల్ షాకిబ్ ఉర్ రహ్మాన్ అన్నారు. అఖిలేష్‌కు ఓపెన్ జీపు ఉండేదని, తాను బస్సు స్టాపులో నిరీక్షిస్తున్నప్పుడు అటుగా వస్తే తనను వొంటికొప్పల్‌లోని తన ఇంటి వద్ద జీపులో వదిలేసేవాడని కరుణ చెప్పారు. తమ స్నేహం ఇప్పటికీ కొనసాగుతోందని, ప్రతి ఆరు నెలలకు ఒక్కసారి కలుసుకుంటామని ఆయన చెప్పారు.
బరేలీకి వస్తే తనను తప్పకుండా అఖిలేష్ కలుసుకుంటాడని, తమ చర్చంతా కాలేజీ రోజుల గురించే సాగుతుందని, చివరి సారి ఎన్నికల ప్రచారం కోసం వచ్చారని, తీరిక లేకుండా ఉన్నప్పటికీ తనతో అర గంట సేపు గడిపారని ఆయన గుర్తు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications