వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవికి ఇస్తే బాగుంటుంది, టిడిపికి 3వ స్థానం: బొత్స

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
న్యూఢిల్లీ: తిరుపతి శాసనసభ్యుడు, కాంగ్రెసు పార్టీ నేత చిరంజీవికి రాజ్యసభ సీటు ఇస్తే బాగుంటుందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం ఢిల్లీలో అన్నారు. ఆయన హైదరాబాద్ బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడారు. రానున్న ఉప ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మూడో స్థానానికే పరిమితమవుతుందని ఆయన అన్నారు. కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ రెండూ తమకు ప్రత్యర్థి పార్టీలేనని ఆయన అన్నారు. ఏడు నియోజకవర్గాల్లో తాము గెలిచేందుకు కృషి చేస్తున్నామన్నారు. టిడిపి మూడు కాదు కదా ఒక్క సీటునైనా గెలుచుకుంటుందా అని ప్రశ్నించారు. తెలంగాణ సమస్యను పరిష్కరించడం జాతీయ పార్టీ అయిన కాంగ్రెసుకే సాధ్యమన్నారు. ఇరు ప్రాంతాల ప్రజల అభిప్రాయాలు తీసుకొని కాంగ్రెసు త్వరలో పరిష్కరిస్తుందన్నారు. తెలంగాణలోనూ తమ పార్టీ విజయం సాధిస్తుందని అన్నారు. రాష్ట్రంలో తమ పార్టీ బలహీన పడలేదన్నారు. బలంగానే ఉందని చెప్పారు.

మంత్రులు, పార్లమెంటు సభ్యుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆయన అన్నారు. ఉప ఎన్నికలైనా, సాధారణ ఎన్నికలైనా అందరం కలిసి కట్టుగా పని చేస్తామని అన్నారు. చిరంజీవికి రాజ్యసభ సీటుపై ఆయన స్పందించారు. చిరంజీవికి రాజ్యసభ సీటు ఇస్తే బాగుంటుందనేది తన అభిప్రాయం అన్నారు. అధిష్టానం అందరి పేర్లు పరిశీలించి అవకాశం కల్పిస్తుందన్నారు. తమ వద్దకు వచ్చిన అన్ని పేర్లను పరిశీలీస్తారన్నారు. కాగా అనంతరం ఆయన హైదరాబాద్ బయలుదేరారు.

English summary
PCC chief Botsa Satyanarayana hoped that party high command may give RS to Tirupati MLA Chiranjeevi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X