హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉప పోరు బరిలో: రంగంలో గండ్ర భార్య, పిఆర్పీ వారే

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi-Kiran Kumar Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యులపై వేటు పడటంతో పదిహేడు నియోజకవర్గాల్లో రానున్న ఉప ఎన్నికల బరిలో ఎవరిని నిలపాలనే చర్చ కాంగ్రెసులో జోరుగా సాగుతోంది. జగన్ పార్టీ తరఫున ఎలాగూ వేటు పడిన వారే ఉప బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. ఇన్నాళ్లూ ఆయా జిల్లాల్లో కాంగ్రెసు పార్టీ తరఫున కీలకంగా ఉన్న నేతలు జగన్ పంచన చేరడంతో ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం కాంగ్రెసు మల్లగుల్లాలు పడుతోంది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో కుటుంబం మధ్యనే రసవత్తర పోరు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్ పార్టీ తరఫున మంత్రి ధర్మాన ప్రసాద రావు సోదరుడు ధర్మాన కృష్ణదాసు పోటీ చేస్తారు. ఈయనపై ధర్మాన రాందాసును పోటీ నిలిపే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మిగిలిన చోట్ల కూడా బరిలోకి దింపాల్సిన నేతల పేర్లను ఇప్పటి నుండే కాంగ్రెసు పరిశీలిస్తోంది.

నరసాపురం నుండి కొత్తపల్లి సుబ్బారాయుడు, మాచర్ల నుండి లక్ష్మా రెడ్డి, ప్రత్తిపాడు నుండి సుధాకర్ బాబు, ఒంగోలు నుండి శ్రీనివాసులు, ఉదయగిరి నుండి విజయ రాంరెడ్డి, రాయచోటి నుండి రాం ప్రసాద్ రెడ్డి, రైల్వే కోడూరు నుండి ఈశ్వరయ్య, రాయదుర్గం నుండి పాటిల్ వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మిగనూరు నుండి రుద్ర గౌడ్, తిక్కా రెడ్డి, అనంతపురం నుండి వెంకట్రామి రెడ్డి కుటుంబ సభ్యులలో ఒకరు, ఆళ్లగడ్డ నుండి గంగుల ప్రతాప్ రెడ్డి, పరకాల నుండి ప్రభుత్వ చీప్ విప్ గండ్ర వెంకట రమణా రెడ్డి సతీమణి గండ్ర జ్యోతి పేర్లను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆయా నియోజకవర్గాలలో పట్టున్న కాంగ్రెసు నేతలు పెద్దగా లేకపోవడంతో గత సాధారణ ఎన్నికలలో పోటీ చేసిన పిఆర్పీ అభ్యర్థులనే రంగంలోకి దింపే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లుగా సమాచారం.

English summary
Chief Whip Gandra Venkata Ramana Reddy wife Jyothy may contest from Parakal in next bypolls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X