రాజ్యసభ నుండి దాసరి, కెకె ఔట్? చిరంజీవి ఇన్

పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ ఢిల్లీ వచ్చి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి గులాంనబీ ఆజాద్‌ను కలుసుకోవడంతో రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగిందన్న ఊహాగానాలు బయల్దేరాయి. మార్చి 12 తర్వాతే ఈ విషయంపై అధికారికంగా చర్చలు జరుగుతాయని, బుధవారం ఆజాద్ పుట్టినరోజు కావడంతో గురువారం వచ్చి అభినందనలు తెలిపానని బొత్స చెప్పారు. రేణుకా చౌదరి, చిరంజీవితో పాటు రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఒక నేతకు రాజ్యసభ అవకాశం లభించవచ్చునని రాజకీయవర్గాలు అంటున్నాయి. మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి, ముఖ్యమంత్రికి న్యాయసలహాదారుగా ఉన్న వరంగల్ మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి కుమారుడు రఘు రెడ్డి, పెన్నా ప్రతాప్ రెడ్డిలతో పాటు దివంగత వైయస్ఆర్ సోదరుడు వైయస్ వివేకానంద రెడ్డి కూడా రంగంలో ఉన్నారు. సోనియాను ఇప్పటికే కలుసుకున్న వివేకానంద రెడ్డి మూడు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి ఆజాద్‌ను, ఇతర నేతలను కలుసుకున్నారు.












Click it and Unblock the Notifications