తుంగభద్ర తీరాన కెసిఆర్ విగ్రహం: టిజి వెంకటేష్

కర్నూలు జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో మహాత్మాగాంధీ విగ్రహ ఏర్పాటుకు ఆయన గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ- తెలంగాణ ఉద్యమం పేరుతో రాజధానిలోని ట్యాంక్‌బండ్‌పై ఉన్న సాహితీ, సాంస్కృతిక రంగాల మహనీయులు, స్వాతంత్య్రోద్యమ నాయకుల విగ్రహాలను టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధ్వంసం చేయడం విచార కరమన్నారు. అందుకే ఆ విగ్రహాలను తుంగభద్ర నదీతీరాన నిర్మించే వరద రక్షణ గోడలపై నెలకొల్పుతున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు, కలెక్టర్ రాంశంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications