చిరంజీవికి కౌంటర్: దాసరి కోసం బొత్స సత్తిబాబు ప్లాన్

Botsa Satyanarayana
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి దగ్గరైన మెగాస్టార్ చిరంజీవికి చెక్ పెట్టేందుకు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్లాన్ వేసినట్లు చెబుతున్నారు. త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి కాంగ్రెసుకు నాలుగు స్థానాలు దక్కే అవకాశం ఉంది. చిరంజీవి, దాసరి నారాయణ రావు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో దాసరికి ఇస్తే చిరంజీవికి ఇవ్వడానికి వీలు కాదు. దీంతో చిరంజీవిని రాజ్యసభకు దూరం చేయడం ద్వారా కేంద్ర మంత్రి పదవికి కూడా దూరం చేయాలని బొత్స ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. మొదటి నుంచి కాంగ్రెసుకు సేవలందిస్తున్న దాసరి నారాయణ రావును దూరం పెట్టడం మంచిది కాదని ఆయన పార్టీ అధిష్టానానికి నూరి పోస్తున్నట్లు చెబుతున్నారు.

మద్యం సిండికేట్ల వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనపై దాడి చేస్తుంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రోత్సహించినట్లుగా వ్యవహరించే అభిప్రాయం కూడా బొత్సకు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషంయలో ముఖ్యమంత్రి తీరుపై అధిష్టానం వద్ద తన నిరసనను వ్యక్తం చేసినట్లు సమాచారం. లిక్కర్‌ వ్యవహారం గురించి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ గులాం నబీ ఆజాద్‌ నేరుగా బొత్సతో ప్రస్తావించినట్లు సమాచారం. మీ వల్ల పార్టీకి ఇబ్బంది కర పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆజాద్‌ అన్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ జూన్‌ నెల వరకూ మాత్రమే తమ వాళ్లు మద్యం వ్యాపారంలో కొనసాగుతారని, ఆపై జరిగే మద్యం వేలంపాటలో పాల్గొన్నవద్దని తన వాళ్లకు స్పష్టంగా చెప్పానని ఆజాద్‌కు బొత్స సత్యనారాయణ వివరణ ఇచ్చినట్లు సమాచారం. మద్యం వ్యాపారం చేయవద్దని తన కుటుంబసభ్యులకు, సన్నిహితులకు, స్నేహితులకు, ఆప్యాయులకు స్పష్టంగా చెప్పిన విషయాన్ని మీడియా ముఖంగా తాను ప్రకటించానని బొత్స సత్యనారాయణ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+