మహబూబ్‌నగర్: రామోజీ రావుకు చెందిన ఈనాడు దినపత్రికపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు తీవ్రంగా ధ్వజమెత్తారు. ఆంధ్ర పాలకుల కొమ్ము కాస్తూ పనికట్టుకుని ఈనాడు దినపత్రిక పిచ్చి పిచ్చి రాతలు రాస్తోందని, ఆ పత్రికకు నూకలు చెల్లే రోజులు దగ్దరకు వచ్చాయని ఆయన అన్నారు. కొల్లాపూర్‌లో ఆయన శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావును గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.
అంతకు ముందు ఆయన నాగర్‌కర్నూలులో నాగం జనార్దన్ రెడ్డి నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఉప ఎన్నికల్లో చెరి సగం సీట్లు గెలుచుకునేందుకు తెలుగుదేశం తరఫున ముద్దుకృష్ణమ నాయుడు స్వయంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇంట్లో కూర్చుని ఫిక్సింగ్ చేసుకున్నారని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే మురుగు కాలువలో వేసినట్లేనని ఆయన అన్నారు.