తెరాసను మూసేస్తే కెసిఆర్ షరతులకు సరే: మోత్కుపల్లి

ఎవరు పైసలిస్తే వారి వద్దకు వెళ్లే రాజకీయ వ్యభిచారి కెసిఆర్ అని ఆయన వ్యాఖ్యానించారు. కోదండరామ్‌కు బుద్ధుందా అని ఆయన అడిగారు. మహబూబ్‌నగర్‌లో ఎవరికి మద్దతిస్తారో కోదండరామ్ చెప్పకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. ప్రస్తుత పరిస్థితికి కోదండరామే కారణమని ఆయన అన్నారు. చెన్నారెడ్డి కన్నా మించిన మోసగాడు కెసిఆర్ అని ఆయన వ్యాఖ్యానించారు. అడ్డా మీద కూలీ మాదిరిగా కెసిఆర్ వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. ఎన్ని డబ్బులు తీసుకుని కెసిఆర్ తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తిడుతున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కెసిఆర్ మోసం చేసిన తీరున పాటల ద్వారా ప్రచారం చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications