వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌ను అరెస్టు చేయాలని టార్గెట్ చేశారు: వైయస్సార్సీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jupudi Prabhakar Rao and Vasireddy Padma
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయాలని అధికార కాంగ్రెసు పార్టీ ప్రయత్నాలు చేస్తోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, శాసనమండలి సభ్యుడు జూపూడి ప్రభాకర రావు సోమవారం అన్నారు. సిబిఐ, హైకోర్టు చేయని పని సుప్రీం కోర్టు చేసిందని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులకు జగన్‌ను బాధ్యుడిని చేయడం సరికాదన్నారు. మంత్రులను విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ ఆస్తుల వ్యవహారంలో సుప్రీం కోర్టు ఆరుగురు మంత్రులు, ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులకు నోటీసులు జారీ చేయడం స్వాగతించాల్సిన విషయమన్నారు. మంత్రులు రాజీనామా చేసి విచారణను ఎదుర్కోవాలన్నారు.

ఏ తప్పు చేయని మంత్రులే అయితే వారు రాజీనామా చేయాల్సిందేనన్నారు. సిబిఐ అధికారులు మంత్రులను ఎందుకు ప్రశ్నించలేదన్నారు. రాజ్యాంగంపై గౌరవంతో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిన న్యాయవాది సుధాకర్ రెడ్డిని ఆయన అభినందించారు. కాగా జగన్ పైన కాంగ్రెసు పార్టీ కుట్ర చేస్తుందని మరో నేత రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి సుపరిపాలన జగన్ వల్లే సాధ్యమన్నారు. మద్యం సిండికేట్ల విషయంలో ప్రభుత్వం మంత్రులను వదిలేసి అధికారులను బలి చేస్తుందని కొండా సురేఖ వరంగల్ జిల్లాలో అన్నారు. కళంకిత మంత్రులను వెంటనే రాజీనామా చేయాలని లేదా ముఖ్యమంత్రి వారిని తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు.

సుప్రీం కోర్టు తీర్పు ఆనందంగా ఉందని మరోనేత వాసిరెడ్డి పద్మ హైదరాబాదులో అన్నారు. జగన్‌ను అరెస్టు చేయాలనే దుర్బద్దితోనే కాంగ్రెసు విచారణ చేయిస్తుందని ఆమె విమర్శించారు. విచారణ నిబంధనల ప్రకారం జరగటం లేదని తాము మొదటి నుండి చేస్తున్న వాదనలకు సుప్రీం కోర్టు తీర్పుతో బలం చేకూరిందన్నారు.

English summary
YSR Congress Party leader Jupudi Prabhakar Rao and Vasireddy Padma accused that Congress is trying to arrest YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X