జగన్ కేసు: ఆరుగురు మంత్రులకు సుప్రీం నోటీసులు

ఆయన పిటిషన్ స్వీకరించి విచారించిన కోర్టు సోమవారం మంత్రులు, ఐఏఎస్ అధికారులకు నోటీసులు జారీ చేసింది. వివాదాస్పద జివోల్లో ఉన్న మంత్రుల పాత్రపై విచారణ జరపాలని ఆయన సుప్రీంను కోరారు. జివోలతో సంబంధం ఉన్న ఐఏఎస్‌లను సైతం విచారించాలని ఆయన పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. జగన్‌కు అనుకూలంగా జివోలు జారీ చేసిన మంత్రులు, అధికారులను విచారించాలని ఆయన కోరారు. సుధాకర్ రెడ్డి అంతకుముందు ఇదే విషయంపై హైకోర్టులో కేసు వేశారు. హైకోర్టు ఆయన పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీంతో అతను సుప్రీం కోర్టును ఆశ్రయించారు.












Click it and Unblock the Notifications