హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ అవినీతిలో మాకు భాగస్వామ్యమా?: మోపిదేవి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mopidevi Venkataramana
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో తమను భాగ్వాములు చేయడమేమిటని ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ సోమవారం అన్నారు. జగన్ ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు తనకు నోటీసులు పంపడంపై ఆయన స్పందించారు. జగన్ అవినీతిలో తమను భాగస్వాములను చేయడమేమిటని ఆవేదన వ్యక్తం చేశారు. తెరముందు జరిగే నిర్ణయాలకే మంత్రులుగా తాము బాధ్యత వహిస్తామన్నారు. తెర వెనుక జరిగే వాటికి తామెలా బాధ్యత వహించగలమన్నారు. సుప్రీం కోర్టు నోటీసులు తనకు ఇంకా అందలేదన్నారు. అవి అందిన తర్వాత కోర్టుకు తగిన వివరణ ఇస్తామని ఆన చెప్పారు.

కాగా జగన్ ఆస్తుల కేసులో తమ ఎదుట తొమ్మిదవ తేదిన హాజరు కావాలని సిబిఐ మోపిదేవి వెంకట రమణకు నోటీసులు పంపినట్లుగా తెలుస్తోంది. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా తాను తొమ్మిదో తేదిన హాజరు కానని, మరో రోజు హాజరవుతానని ఆయన చెప్పారని తెలుస్తోంది. దీంతో త్వరలో ఆయన జగన్ ఆస్తుల కేసులో సిబిఐ ఎదుట హాజరయ్యే అవకాశముంది.

English summary
Minister Mopidevi Venkataramana responded on Supreme Court notices to him in YS Jaganmohan Reddy assets case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X