వైయస్ జగన్ అక్రమాస్తుల కేసు వేరు: కిరణ్ కుమార్ రెడ్డి

ఉప ఎన్నికల్లో మంత్రులకు నోటీసులు ఇచ్చిన అంశం ప్రస్తావనకు రాదని, దాని ప్రభావం కూడా ఉప ఎన్నికలపై పడదని ఆయన అన్నారు. నిజాయితీని, పారదర్శకతను తీసుకురావడమే తమ ధ్యేయమని ఆయన అన్నారు. ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్న స్థానాల్లో మూడు చోట్ల తాము గెలుపు వాకిట ఉన్నామని, మరో మూడు చోట్ల తీవ్రమైన పోటీ ఇస్తున్నామని ఆయన అన్నారు. మద్యం కుంభకోణంలో రాజకీయ నేతల ప్రమేయం లేదని, అందుకే ఎసిబి రాజకీయ నాయకులను అరెస్టు చేయలేదని ఆయన చెప్పారు. అధికారులు ముడుపులు తీసుకున్నట్లు ఆధారాలున్నాయని ఆయన చెప్పారు. మంత్రివర్గాన్ని మార్చినంత మాత్రాన ఇబ్బందులు పోవని ఆయన అన్నారు. సమాచార కమిషనర్ల నియామకం ఫైలు తన వద్దే ఉందని ఆయన చెప్పారు.
నిర్ణయాలకు మంత్రి వర్గం సమిష్టి బాధ్యత వహిస్తుందని రవాణా శాఖ మంత్రి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. అయితే తెర వెనక నిర్ణయాలతో తమకు సంబంధం లేదని ఆయన విడిగా అన్నారు. కళ్లు మూసుకుని సంతకాలు పెడితే తప్ప తప్పులు జరగవని ఆయన అన్నారు. తనపై కేసులో తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్టే తెచ్చుకున్నారని, విలువలు లేనిది చంద్రబాబుకేనని ఆయన అన్నారు. జీవోల్లో తప్పులు లేవని ఆయన అన్నారు. తప్పులు జరిగినట్లు నిర్ధారణ అయితే తాము బాధ్యత వహిస్తామని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు నోటీసులు రాగానే రాజీనామాలు చేయాలనడం అర్థం లేనిదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications