తండ్రిలాగే జగన్ మాటపై నిలబడే నేత: విజయమ్మ

ఒక్క రూపాయి కూడా పన్నులు పెంచకుండా సంక్షేమ కార్యక్రమాలు అణలు చేసిన ఘనత వైయస్సార్‌కే దక్కుతుందని విజయమ్మ అన్నారు. తన రెక్కల కష్టం మీద కాంగ్రెసును రెండోసారి వైయస్ అధికారంలోకి తెచ్చారని ఆమె అన్నారు. వైయస్సార్ పథకనలు ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం చూస్తే బాధేస్తోందని ఆమె అన్నారు. వైయస్ ఆశయాల కోసం పనిచేస్తున్న జగన్‌కు ప్రజలందరి అండదండలు కావాలని కోరారు. పార్టీ పెట్టిన ఏడాదిలోనే వివిధ ప్రజాసమస్యలపై జగన్ రాజీలేని పోరాటం చేశారని ఆమె గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications