వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియాతో దాసరి భేటీ: రాజ్యసభ సీట్లకు పోటాపోటీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Dasari Narayana Rao-YS Vivekananda Reddy-K Keshav Rao
న్యూఢిల్లీ: కాంగ్రెసులో రాజ్యసభ సీట్ల కోసం రాష్ట్ర కాంగ్రెసు నాయకుల నుంచి పోటీ పెరుగుతోంది. ఎవరికి వారు రాజ్యసభ టికెట్ కోసం కాంగ్రెసు పార్టీలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. తాజాగా, మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణ రావు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. అయితే, తాను రాజ్యసభ సీటు అడగలేదని, తనకు అధికార వాంఛ లేదని, పదవులపై వ్యామోహం లేదని ఆయన అన్నారు. ఆరోగ్య వివరాలు తెలుసుకుని, పరామర్సించేందుకు మాత్రమే తాను సోనియాను కలిసినట్లు ఆయన చెప్పారు. అయితే, రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఏ ఉద్దేశంతో కలిసినా టికెట్ కోసమే అనుకోవడం మామూలు వ్యవహారమే. ప్రస్తుతం దాసరి నారాయణ రావు రాజ్యసభ పదవీ కాలం ముగుస్తోంది. తిరిగి తనను రాజ్యసభకు నామినేట్ చేయాలని ఆయన కోరినట్లు ప్రచారం జరుగుతోంది.

కాగా, తెలంగాణకు చెందిన కేశవరావు కూడా తిరిగి తనను రాజ్యసభకు నామినేట్ చేయాలని కోరుతున్నారు. తెలంగాణ పార్లమెంటు సభ్యులు ఆయనకు అండగా నిలుస్తున్నారు. అయితే, తెలంగాణ విషయంలో కాస్తా ధిక్కారణ ధోరణి ప్రదర్శించిన కారణంగా కేశవరావును రాజ్యసభకు తిరిగి నామినేట్ చేసేందుకు అధిష్టానం సిద్ధంగా లేదని అంటున్నారు. కాగా, మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి ఏ మాత్రం దాచుకోకుండా తాను రాజ్యసభ టికెట్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు చెబుకుంటున్నారు. అయితే, ఈ ముగ్గురి విషయంలోనూ అధిష్టానం ఆలోచణ మరో విధంగా ఉన్నట్లు చెబుతున్నారు.

దాసరి స్థానంలో చిరంజీవిని రాజ్యసభకు నామినేట్ చేసి ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు చెబుతున్నారు. ఎఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి కూడా రాజ్యసభ రేసులో ముందు వరుసలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్టం నుంచి జరిగే ఆరు స్థానాల్లో కాంగ్రెసు నాలుగు స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది. దాంతో పదవీ కాలం ముగుస్తున్నవారిని పక్కన పెట్టి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.

English summary
Congress leaders are trying for Rajyasabha seat. Out going Rajyasabha member Dasari Narayana Rao met sonia Gandhi today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X