జగన్, బాబు కుమ్మక్కై మంత్రులను ఇరికించారు: కన్నా

Kanna Laxmi Narayana - Ponnala Laxmaiah
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసును నీరుగార్చే ప్రయత్నాలు తెలుగుదేశం పార్టీ చేస్తోందని మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ మంగళవారం అన్నారు. జగన్ కేసులో మంత్రుల పేర్లను తెరపైకి తీసుకు రావడం వెనుక టిడిపి, జగన్ కుట్ర ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. జగన్, టిడిపి కుమ్మక్కై కేసులను నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అందుకే టిడిపి మంత్రులను రాజీనామా చేయమని డిమాండ్ చేస్తుందని అన్నారు. రాంకీ సంస్థకు సంబంధించిన జివో జారీలో తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. సుప్రీం కోర్టు నోటీసులు ఇస్తే తాము నేరం చేసినట్లా అని మరో మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి సహా తనకు ఎవరూ శత్రువులు లేరన్నారు. తాను దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో అయినా, ఇప్పుడైనా చట్టపరిధిలో పని చేశానన్నారు.

తెలుగుదేశం పార్టీ తమ రాజీనామాలు కోరడంలో అర్థం లేదన్నారు. వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా రాజీనామా చేశారా అని ప్రశ్నించారు. అలాంటప్పుడు తమ రాజీనామా ఎందుకు అడుగుతున్నారన్నారు. తాను ఏ తప్పూ చేయలేదన్నారు. ఈ సందర్భంగా పొన్నాల తన హయాంలో విడుదల చేసిన జివోలను మీడియాకు విడుదల చేశారు. కాగా జగన్ కేసులో సుప్రీం కోర్టు నోటీసులు అందుకున్న మంత్రులు అసెంబ్లీ లాబీల్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గీతారెడ్డి, ధర్మాన, కన్నా ముఖ్యమంత్రిని కలిశారు. మరోవైపు మంత్రుల రాజీనామాకు విపక్షాలు డిమాండ్ చేయడంతో స్పీకర్ సభను రెండోసారి అరగంట పాటు వాయిదా వేశారు. స్పీకర్ ఫ్లోర్ లీడర్లను తన చాంబర్‌కు పిలిపించి మాట్లాడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+