కెసిఆర్‌కు కౌంటర్: బాబు, కిరణ్ తెలంగాణ వ్యూహం

2014 ఎన్నికల లోపు తెలంగాణ ఇచ్చినా తమ పార్టీకి ఏ విధమైన ఇబ్బంది ఉండదని చంద్రబాబు చేసిన ప్రకటనకు దీటుగా కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం తన ప్రచారం తెలంగాణపై ప్రకటన చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గం ప్రజలు తెలంగాణను కోరుకుంటున్నారని తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి చెబుతానని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. తెలంగాణ ప్రజల సెంటిమెంటు తనకు తెలుసునని, తెలంగాణ ఇస్తామని అధిష్టానం అంటే తాను కట్టుబడి ఉంటానని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను అధిష్టానానికి చెప్పాలనే ఇంత దాకా ఇతర పార్టీల నాయకులే కాకుండా కాంగ్రెసు తెలంగాణ ప్రాతం నాయకులు కూడా కిరణ్ కుమార్ రెడ్డిని చాలా కాలంగా కోరుతున్నారు.
దానికి తోడు, అభివృద్ధి మంత్రాన్ని కిరణ్ కుమార్ రెడ్డి జపిస్తున్నారు. తాను అభివృద్ధి చేయడానికి ముందుంటానని ఆయన తెలంగాణ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. తెరాసను గెలిపిస్తే తెలంగాణ రాదని చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. అయినా, ఆ ఇద్దరు నాయకులకు తెలంగాణవాదుల నుంచి అక్కడక్కడా వ్యతిరేకత ఎదురువుతూనే ఉన్నది. అయితే, గతంలో కన్నా కాస్తా స్వేచ్ఛగా తిరగడానికి అవకాశం కలగడం వారికి ఆశాజనకంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications