ఈనాడు కనుసన్నల్లో సిబిఐ జెడి పని: జగన్ పార్టీ నేత

తప్పుడు జీవోలుగా చెబుతున్నవాటిని జారీ చేసినవారిని విచారించకుండా సిబిఐ ఏకపక్షంగా, పక్షపాత ధోరణితో వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసులకు సిబిఐ వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ఇప్పటికైనా వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. హైకోర్టు అడిగిన రోజునే ఆ జీవోలు సక్రమమమైనవని ప్రభుత్వం చెప్పి ఉటే పరిస్థితి ఇక్కడి దాకా వచ్చి ఉండేది కాదని ఆయన అన్నారు. ఆ రోజు ప్రభుత్వం ఎందుకు స్పందించలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆ జీవోలు జారీ చేసిన మంత్రుల పేర్లను తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఫిర్యాదులో ఎందుకు ఉటంకించలేదో చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. జీవోలు జారీ చేసిన మంత్రులకు, తెలుగుదేశం నాయకులకు ఉన్న సంబంధమేమిటో చెప్పాలని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు ఇవ్వడంతో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల పరిస్థితి కుడితిలో పడిన ఎలుకల్లాగా తయారైందని ఆయన వ్యాఖ్యానించారు.