ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉందని వాస్తు ప్రకారం కనిపెట్టే సూత్రాలు ఇవే

ఇంట్లో ప్రశాంతత కరువైందా? ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవడం లేదా? అనుకోని అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయా? అయితే మీ ఇంట్లో 'నెగెటివ్ ఎనర్జీ' చేరి ఉండవచ్చని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇల్లు అనేది కేవలం నాలుగు గోడల మధ్య ఉండే స్థలం కాదు, అది మన జీవితాన్ని, ఆలోచనలను శాసించే శక్తుల నిలయం అని తెలుసుకోవాలి. అందుకనుగుణంగా మన జీవన విధానం ఉండాలి. ఇంట్లో ప్రతికూల వాతావరణం ఉందో లేదో తెలుసుకోవడానికి కనిపించే 5 ముఖ్యమైన లక్షణాలు, వాటిని తరిమికొట్టే అద్భుతమైన పరిహారాలను తెలుసుకుందాం.

ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉందని చెప్పే 5 స్పష్టమైన లక్షణాలు
చిన్న చిన్న విషయాలకే కుటుంబ సభ్యుల మధ్య తీవ్రమైన విభేదాలు రావడం,
ఒకరినొకరు అనుమానించుకోవడం.
బయట బాగున్నా, ఇంట్లోకి అడుగు పెట్టగానే తెలియని బరువు,
మానసిక ఒత్తిడి కలగడం. రాత్రిళ్లు పీడకలలు రావడం, నిద్ర పట్టకపోవడం.
ఎంత కష్టపడి సంపాదించినా, చేతికి వచ్చిన అవకాశాలు చేజారిపోవడం
అనవసరపు ఖర్చులతో డబ్బు నిలవకపోవడం.
ఇంట్లో ఒకరు కోలుకునేలోపే మరొకరు అనారోగ్యం బారిన పడటం.
ఇంట్లో ఎంత జాగ్రత్తగా పెంచుకుంటున్నా మొక్కలు పదే పదే వాడిపోవడం లేదా ఎండిపోవడం.

Vastu Tips These are the principles for detecting the presence of negative energy in a home

కల్లుప్పు మ్యాజిక్

మన వంటగదిలో ఉండే కల్లుప్పుకు ప్రతికూల శక్తులను లాగేసుకునే అపారమైన శక్తి ఉంది.
ఒక చిన్న గాజు గిన్నెలో కల్లుప్పు తీసుకుని
ఇంటి నైరుతి లేదా ఈశాన్య మూలల్లో ఉంచండి.
ప్రతి వారం ఈ ఉప్పును మారుస్తూ, పాత ఉప్పును ఎవరికీ తగలని చోట
లేదా బేసిన్‌లో పారబోయాలి. అలాగే, ఇల్లు తుడిచే నీటిలో
కొద్దిగా కల్లుప్పు వేసి శుభ్రం చేయడం వల్ల
నెగెటివ్ వైబ్స్ త్వరగా తొలగిపోతాయి.

ధూపం, కర్పూర హారతి
ప్రతిరోజూ సాయంత్రం వేళల్లో ఇంట్లో కర్పూరం వెలిగించడం
లేదా సాంబ్రాణి ధూపం వేయడం అలవాటు చేసుకోండి.
దీనివల్ల ఇల్లంతా పవిత్రమైన సుగంధం వ్యాపించి, దుష్ట శక్తులు నశిస్తాయి.

ప్రకృతి సిద్ధమైన గాలి, వెలుతురు

ఇంటి ముఖద్వారం వద్ద ఎప్పుడూ చీకటి ఉండకూడదు.
వారానికి ఒక్కసారైనా ఇంటి కిటికీలు,
తలుపులు పూర్తిగా తెరిచి ఉంచడం ద్వారా ప్రకృతి సిద్ధమైన గాలి,
సూర్యరశ్మి ఇంట్లోకి ప్రవేశించి నెగెటివ్ ఎనర్జీని సహజంగానే తుడిచిపెట్టేస్తాయి.

పాత, విరిగిన వస్తువుల తొలగింపు

చాలామంది ఇళ్లను అందంగా ఉంచుకుంటారు కానీ
మూలల్లో పేరుకుపోయే బూజును, పాత సామాన్లను పట్టించుకోరు.
విరిగిన అద్దాలు, పగిలిన పాత్రలు, ఆగిపోయిన గడియారాలు
ఇంట్లో ఉంచడం వల్ల తీవ్రమైన వాస్తు దోషాలు ఏర్పడతాయి.
కాబట్టి, వెంటనే అలాంటి వస్తువులను ఇంటా బయట పారేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+