కోట్లు తీసుకొని జగన్‌కు జై కొట్టాడు:బొత్స, చిరుతో కలిసి..

Chiranjeevi-Botsa Satyanarayana
నెల్లూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వద్ద రూ.10 కోట్లు తీసుకొని జగన్‌కు జై అన్నారని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం ఆరోపించారు. కాంగ్రెసు పార్టీ అభ్యర్థి పొలంరెడ్డి శ్రీనివాస రెడ్డి తరఫున శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవూరు నియోజకవర్గంలో ఆయన ప్రచారం నిర్వహించారు. లేగుంటపాడు రోడ్డు షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొత్స నల్లపురెడ్డి, జగన్‌పై ధ్వజమెత్తారు. కొందరు పదవులకొద్ది డబ్బు కూడబెట్టుకొని ప్రజాభిప్రాయాన్ని కొనాలని చూస్తున్నారని జగన్‌ను ఉద్దేశించి విమర్శించారు. అవినీతిపరులకు కొమ్ము కాయవద్దని ప్రజలకు సూచించారు. దోపిడీదారులకు ఓటేయకండని కోరారు. అలాంటి వారికి ఓటు వేస్తే నష్టమన్నారు. అభివృద్ధి కోసం కాంగ్రెసుకు ఓటేయాలని సూచించారు.

ముఖ్యమంత్రి పీఠాన్ని ఎలా కబ్జా చేయాలా అనే కొందరు చూస్తున్నారు తప్ప అభివృద్ధి, సంక్షేమం వారికి పట్టడం లేదని తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి అన్నారు. సంక్షేమ పథకాలు ఆగిపోయాయని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అది వాస్తవం కాదన్నారు. నాకు ఈ స్థానం మీ వల్లే వచ్చిందని ఆయన అన్నారు. అధికారంలో ఉన్న వారికి ఓటేస్తే అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ప్రసన్నకు ఓటేస్తే తీర్పును అవమానించినట్టేనని అన్నారు. ఎవరు దోషులో సిబిఐ తేలుస్తుందని అన్నారు. జీవితాంతం మీకు అండగా ఉంటానని అన్నారు. కాగా బొత్స సత్యనారాయణ.. చిరంజీవితో కలిసి కొవూరులో ప్రచారం నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+