వీలుకాకనే ప్రచారానికి చెర్రీ, నాగబాబును పంపా: చిరు

ఇక్కడ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి గెలుపొందడం ఖాయమన్నారు. కడప, పులివెందుల ఫలితాలు ఇక్కడ పునరావృతం కావన్నారు. అక్కడి ఎన్నికల వ్యూహాల్లో జరిగిన పొరపాట్లు ఇక్కడ జరగనివ్వమన్నారు. ఈ ఎన్నికలు రిఫరెండం కాదన్నారు. తన ప్రచారానికి ప్రజల స్పందన బాగుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పథకాలు ఆగిపోయాయన్న దుష్ప్రచారాన్ని తాము సమర్థవంతంగా తిప్పికొట్టామన్నారు. గతంలో తాను చేసిన యాత్రలకు ఎంతటి ప్రజా స్పందన లభించిందో ఇప్పుడు అదే లభిస్తుందన్నారు. అది తాను చెప్పడం లేదని మీడియానే చెబుతోందన్నారు. కడప, పులివెందులలోని ప్రజాస్పందనను ఓట్లుగా మరల్చుకోలేక పోయామని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడు అలా కానివ్వమన్నారు.
ఈ ఉప ఎన్నికలు స్వలాభం కోసం, అడ్డదారిలో దోచుకున్న వారి వల్ల వచ్చాయని, ప్రజల తీర్పు కాలదన్నిన నేత సానుభూతి కోల్పోయారని అన్నారు. ఇప్పుడు ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారన్నారు. ఈ రెండేళ్లు అభివృద్ధి కావాలంటే కాంగ్రెసుకు ఓటేయాలనే నిశ్చయానికి ప్రజలు వచ్చారన్నారు. ప్రచారంలో తాను చెప్పిన ప్రతి పాయింటును ప్రజలు ఆలోచిస్తున్నారన్నారు. కాంగ్రెసుకు ఓటేసేందుకు మానసికంగా సిద్ధమైపోయారన్నారు.












Click it and Unblock the Notifications