సినీ ఫక్కీలో జంట హత్యలు, సుమోలో ఛేజ్ చేసి..

చిత్తూరు జిల్లా కురబలకోట మండలం పెద్దపల్లికి చెందిన బయ్యారెడ్డి, జయచంద్రా రెడ్డికి మధ్య పాత కక్షలున్నాయి. ఇందులో భాగంగా బయ్యారెడ్డి నిరుడు నవంబర్ 20వ తేదీన హత్యకు గురయ్యాడు. కేసులో ప్రధాన నిందితులు తండ్రీకొడుకులు జయచంద్రా రెడ్డి, శివశింకర్ రెడ్డి ఇటీవల షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలయ్యారు. సోమవారం వీరిద్దరు మదనపల్లి కోర్టుకు వెళ్లి కండీషన్ బెయిల్‌పై సంతకం పెట్టి షేర్ ఆటోలో గ్రామానికి బయల్దేరారు. వీరిపై పగతో రగిలిపోతున్న బయ్యారెడ్డి బావ నరసింహా రెడ్డి, ఆయన బంధవులు పెద్ద బయ్యారెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, అమరనాథ రెడ్డి, మల్ రెడ్డి, మరి కొందరు సుమోలో వచ్చి ఆటోను అడ్డగించారు. మిగతా ప్రయాణికులను కిందకు దింపి జయచంద్రా రెడ్డిపై దాడి చేసి కొడవలితో నరికారు. శివశంకర్ రెడ్డిపై దాడి చేసి బయల్దేరారు.
తేరుకున్న శివశంకర్ రెడ్డి కొన ఊపిరితో ఉన్న తండ్రితో మాట్లాడుతుండగా గమనించిన నరసింహా రెడ్డి సుమో దిగి వెనక్కి వచ్చాడు. ఇంతలో శివశంకర రెడ్డి తండ్రిని నరికిన కొడవలితోనే నరసింహా రెడ్డి తల నరికి చంపాడు. దీంతో సుమోలోని మిగతా వారు పరారయ్యారు. జయచంద్రా రెడ్డి సంఘటనా స్థలంలోని మరణించాడు.