గాలి జనార్ధన్‌రెడ్డి ఆస్తుల జప్తునకు సిద్ధమౌతున్న ఈడి?

కాగా ఎఎంసి కేసులో గాలి, ఆయన వ్యక్తిగత కార్యదర్శి అలీఖాన్ కస్టడీ గడువును ఈ నెల 15 వరకు సిబిఐ ప్రత్యేక కోర్టు పొడిగించిన విషయం తెలిసిందే. ఎఎంసి అక్రమ తవ్వకాలకు సంబంధించిన విచారణ ఇంకా పూర్తి కాలేదని, మరో వారం రోజుల కస్టడికి అప్పగించాలని సిబిఐ విజ్ఞప్తి చేసింది. దీంతో గాలి కస్టడిని నాలుగు రోజులపాటు పొడిగించేందుకు సిబిఐ కోర్టు న్యాయమూర్తి అంగీకరించారు. కాగా, విచారణలో భాగంగా గాలిని బళ్లారికి తరలించాల్సి ఉందని కోర్టుకు సిబిఐ అధికారులు తెలిపారు. అంతకుముందు అలీఖాన్‌ను కూడా సిబిఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరు పరచగా నాలుగు రోజుల సిబిఐ కస్టడికి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇక, గాలి, అలీఖాన్‌లు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై విచారణను సిబిఐ ప్రత్యేక కోర్టు ఈ నెల 16కు వాయిదా వేసింది.
ఇక, విచారణ తర్వాత ప్రత్యేక కోర్టు నుంచి సిబిఐ కార్యాలయానికి తరలిస్తున్న సమయంలో తన స్నేహితుడు, మాజీ మంత్రి శ్రీరాములుకు, ఆయన స్థాపించిన కొత్త పార్టీకి అనుకూలంగా గాలి నినాదాలు చేశారు. శ్రీరాములు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. సత్యమేవ జయతే అన్నారు. మరోవైపు గాలి జనార్దన రెడ్డి కేసుల విషయంలో అప్రూవర్‌గా మారాలంటూ సిబిఐ అధికారులు తనపై పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొస్తున్నారని సిబిఐ కోర్టులో అలీఖాన్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అలీఖాన్ కోర్టులో మూడు పిటిషన్లు దాఖలు చేశారు.