డెట్రాయిట్‌లో జగన్ పార్టీ వార్షికోత్సవం, మద్దతు

లింగాల హరిప్రసాద రెడ్డి, సునీల్ మండుటి, వెంకట్ బీరం, వినోద్ కుకునూరు, యుగంధర్ భుమిరెడ్డి, పురుషోత్తం కూకటి, కొనుగంటి రమణా రెడ్డి, వినోద్ ఆత్మకూరు, రవికిరణ్, విద్యాధర రెడ్డి, టి. శ్రీధర్ రెడ్ిడ, శ్రీనివాస్ చిత్తలూరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి అందించిన సువర్ణ పాలనను, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రజల పక్షాన నిలబడి వైయస్సార్ చేపట్టిన పథకాలను విజయవంతంగా అమలు చేయడానికి చేస్తున్న పోరాటాన్ని వారు గుర్తు చేసుకున్నారు. ప్రజలకు అండగా నిలుస్తున్న తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు మద్దతు కొనసాగుతుందని, వైయస్ జగన్ అధికారంలోకి వచ్చి తిరిగి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని వారు ఆశించారు.
కోవూరు అసెంబ్లీ స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి వోటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి, ప్రజలను విస్మరిస్తున్న కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు బుద్ధి చెప్పాలని వారు ప్రజలను కోరారు.












Click it and Unblock the Notifications