హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరుపై అంబటి నిప్పులు, ఆనం సత్తా తేల్చేందుకే సిఎం..

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
హైదరాబాద్: తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు బుధవారం నిప్పులు చెరిగారు. కేంద్రమంత్రి పదవి పొందాలని చిరంజీవి తాను స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసుకు తాకట్టు పెట్టారని విమర్శించారు. తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత చిరంజీవికి ఏమాత్రం లేదన్నారు. చిరంజీవికి సత్తా ఉంటే వచ్చే ఉప ఎన్నికల్లో తమ పార్టీ ఎంపీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్ రెడ్డిపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆనం సోదరుల సత్తా తేల్చడానికే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వేటు వేశారన్నారు. రాబోయే ఫలితాలతో ఆనం సోదరులకు సిఎం చెక్ చెప్పనున్నారని అన్నారు. కడప, పులివెందుల ఫలితాలే ఇక్కడ పునరావృతం అవుతాయన్నారు. కిరణ్ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను మద్యం మాఫియాలో పోటీ ఉండకూడదని ఇరికించారన్నారు. కొవూరులో కాంగ్రెసు పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, టిడిపి వోటర్లను మభ్య పెట్టాలని చూస్తుందని విమర్శించారు. ఆ రెండు పార్టీలకు డిపాజిట్ గల్లంతు కావడం ఖాయమన్నారు.

సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత జనక్ ప్రసాద్ బుధవారం మండిపడ్డారు. జెడి లక్ష్మీ నారాయణ ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని ఆరోపించారు. జెడి పక్షపాత వైఖరి వీడి నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ అధినేత, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పట్ల పక్షపాత ధోరణి వీడాలని అన్నారు. జెడిది మొదటి నుండి ద్వంద్వ వైఖరే అన్నారు. రంగారావును వదిలేసి సునీల్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేశారని ఆయన ప్రశ్నించారు. సిబిఐ ఎఫ్ఐఆర్‌లో మంత్రుల పేర్లు ఎందుకు చేర్చలేదని అన్నారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తమ్ముడి పేరు కూడా ఎఫ్ఐఆర్ నుండి తొలగించారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అంటే లక్ష్మీ నారాయణకు ఎందుకు అంత ప్రేమ అన్నారు. జగన్ కేసులో హడావుడి చేసిన జెడి చంద్రబాబు కేసులో కోర్టు నుండి పత్రాలు తీసుకోవడానికి రెండు వారాలు ఎందుకు పట్టిందని ప్రశ్నించారు. జెడి పక్షపాత ధోరణి వీడకపోతే అత్యున్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

English summary
YSR Congress Party spokes person Ambati Rambabu lashes out at Tirupati MLA Chiranjeevi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X