"బిగ్‌బాస్ 10" వచ్చేస్తుందోచ్.. ప్రోమో వీడియో వైరల్ !!
తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో 'బిగ్‌బాస్' మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుసగా తొమ్మిది సీజన్ల విజయవంతమైన ప్రయాణం తర్వాత.. ఇప్పుడు ఈ షో 10వ సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కొత్త కాన్సెప్, రెట్టింపు వినోదంతో రాబోతోన్న ఈ సీజన్ లో కింగ్ అక్కినేని నాగార్జున మరోసారి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా
స్పెషల్ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ఫుల్ వైరల్ గా మారింది.
ఆ ప్రోమో వీడియోలో నాగార్జున మాట్లాడుతూ.. బిగ్‌బాస్.. ఎన్నో యుద్ధాలు గెలుచుకున్న రాజ్యం మాత్రమే కాదు, ఎంతోమంది హృదయాలు గెలుచుకున్న మహా సామ్రాజ్యం అంటూ పవర్‌ఫుల్ డైలాగ్‌తో ప్రారంభించారు. అలానే నాగ్ సార్‌కి మేము కల్ట్ ఫ్యాన్స్ అంటూ సాగే బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ ఈ ప్రోమోకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ సారి ప్రోమోను కాస్త విభిన్నంగా డిజైన్ చేశారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు, సెలూన్ షాపుల నుంచి ఐటీ ఆఫీసుల వరకు, ఇళ్లలో కుటుంబ సభ్యులంతా బిగ్ బాస్ కోసం ఎంతగా ఎదురుచూస్తారో ఇందులో చూపించారు.

ఇక చివర్లో నాగార్జున "ఈ ప్రస్థానం ఇంకో కొత్త చాప్టర్‌కి సాక్ష్యం కాబోతోంది. ఈ సారి మీరు చూడబోయేది బిగ్ బాస్ 'దశావతారం' (పదో సీజన్). ఈ సారి ఆటలో సవాల్ కాదు.. ఆటే సవాల్!" అంటూ షోపై అంచనాలను భారీగా పెంచేశారు. ఈ ఒక్క క్యాప్షన్‌తో కొత్త సీజన్ ఎంత రసవత్తరంగా ఉండబోతుందో హింట్ ఇచ్చారు. గత సీజన్‌లో సెలబ్రిటీలతోపాటు సామాన్యులకూ అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. అగ్ని పరీక్షను దాటుకుని మరీ ఆరుగురు.. బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టి, తమ టాలెంట్ చూపించారు.
మొత్తానికి సెలబ్రిటీలకు గట్టి పోటీ చివర్లో కామన్‌మ్యానే (కల్యాణ్ పడాల) 'బిగ్‌బాస్ 9' విజేతగా నిలవడం విశేషంగా నిలిచింది. ఈసారి కూడా సామాన్యులకు ఛాన్స్ ఇస్తారా? కేవలం ప్రముఖులకే ఎంట్రీనా? కంటెస్టెంట్‌లు ఎవరు? షో ఎప్పుడు ప్రారంభమవుతుంది? వీటన్నింటికీ సమాధానం తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications