మెగా 158లో ఛాన్స్ కొట్టేసిన కన్నడ బ్యూటీ..
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. సంక్రాంతి కానుకగానే ఆయన నటించిన "మన శంకర వరప్రసాద్ గారు" ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అపజయమే ఎరుగని అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. వింటేజ్ బాస్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ చిత్రంతో అటు మాస్, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటూ, కెరీర్‌లోనే తొలిసారి రూ.300 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించారు. ఈ విజయంతో చిరు నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా పెరిగాయి.
ఈ క్రమంలోనే తన 158వ సినిమాపై ఫోకస్ పెట్టారు మెగాస్టార్. వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు బాబీతో మళ్లీ మూవీ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్‌లో రక్తంతో తడిసిన గొడ్డలి, రక్తం చిందిన బ్యాక్‌డ్రాప్ తో చూపించారు. ఈ చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది. ఈ మూవీ వచ్చే నెలలో ప్రారంభమై, మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని అంటున్నారు.

కాగా "కూతురు సెంటిమెంట్" ఈ కథలో కీలకం కానుందని, తండ్రి-కూతురు మధ్య భావోద్వేగ బంధం చిరంజీవి ఇమేజ్‌కు కొత్త డైమెన్షన్‌ను ఇస్తాయని ప్రచారం జోరుగా సాగుతోంది. అందులో భాగంగానే చిరు కుమార్తె పాత్ర కోసం మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ ఫిక్స్ అయ్యింది. ఈ సినిమాలో చిరంజీవిని కొత్త షేడ్‌లో చూపేందుకు బాబీ కొల్లి ఓ సాలిడ్ మాస్ యాక్షన్ డ్రామాను ప్లాన్ చేస్తున్నట్లు టాక్. యాక్షన్, బలమైన ఎమోషన్, సెంటిమెంట్ కలబోసిన కథగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
అయితే బాలీవుడ్ స్టార్, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ ఇందులో నటించనున్నారన్న ప్రచారం జోరుగా నడుస్తోంది. అలానే మలయాళ అగ్ర నటుడు మోహన్‌లాల్ కూడా ముఖ్య పాత్రలో మెరవనున్నారని గుసగుసలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం మొదటగా హీరోయిన్ హనీ రోజ్‌ను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపించాయి. అయితే అనంతరం ఏమైందో తెలియదు గానీ, ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

దీంతో ఆమె కోసం అనుకున్న పాత్రలో మరో క్రేజీ బ్యూటీని మేకర్స్ ఫైనల్ చేసినట్లు సమాచారం. కన్నడ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ కలిగిన హీరోయిన్లలో ఒకరైన రచితా రామ్‌ను హనీ రోజ్ పాత్రకు ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు రచితా రామ్ తెలుగులో నటించకపోవడంతో, ఈ సినిమా విజయవంతమైతే టాలీవుడ్‌లో ఆమెకు మంచి గుర్తింపు, క్రేజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.












Click it and Unblock the Notifications