చంద్రబాబుకు తెలంగాణవాదుల ఝలక్, నినాదాలు

Chandrababu Naidu
మహబూబ్‌నగర్/ వరంగల్: మహబూబ్‌నగర్ జిల్లా నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని బిజినేపల్లిలో తెలంగాణవాదులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి గురువారం ఝలక్ ఇచ్చారు. చంద్రబాబుకు కాన్వాయ్‌కి అడ్డం పడడానికి ప్రయత్నించారు. జై తెలంగాణ నినాదాలు చేశారు. ఆటో గుర్తుకు ఓటు వేసి నాగం జనార్దన్ రెడ్డిని గెలిపిస్తామంటూ నినాదాలు చేశారు. తెలంగాణవాదులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు.

దోపిడీ దొంగల మాదిరిగా రాష్ట్రాన్ని దోచుకున్నారని చంద్రబాబు విమర్శించారు. వైయస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని ఆయన అన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే వరకు తాము పోరాటం చేస్తానని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి జరిగిందని ఆయన అన్నారు.

అంతకు ముందు చంద్రబాబు వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. తాను తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదని, మాట్లాడబోనని ఆయన అన్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెసు పార్టీయేనని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వస్తే ఉచితంగా బియ్యం ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. తెరాస, కాంగ్రెసు కుమ్మక్కయి తమ పార్టీపై బురద చల్లుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+