'జగన్' తెలివిగా వ్యవహరించారు, మాకు ఇబ్బందే: జెసి

మరోవైపు మంత్రి ధర్మాన ప్రసాద రావు వేరుగా మాట్లాడుతూ... జివోల జారీ వ్యవహారం సమష్టి బాధ్యత అని అన్నారు. ప్రభుత్వ పాలసీల ప్రకారమే తాము జివోలు జారీ చేశామని స్పష్టం చేశారు. జివోలు జారీ చేయాలంటే ఎమ్మార్వో నుండి పై స్థాయి వరకు పద్ధతి ప్రకారం జరుగుతుందని ఆయన చెప్పారు. కాగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవురు ఉప ఎన్నికలపై మంత్రి పితాని సత్యనారాయణ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జగన్ తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే పార్టీ పెట్టాడని విమర్శించారు. తన అవినీతిలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి కూడా భాగస్వామ్యం ఉందని తెలిపే విధంగా సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారని ఆరోపించారు. జగన్‌కు అజెండా ఏదీ లేదని, అలాంటి వ్యక్తికి వోటు వేయవద్దని కోరారు.












Click it and Unblock the Notifications