ప్రియురాలి ఫ్యామిలీ చేతిలో టెక్కీ దారుణ హత్య

హత్యకు పాల్పడిన సూరారం గ్రామానికి చెందిన యాదగిరిని, అతనికి సహకరించిన హైదరాబాదులోని బొరబండకు చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారితో పాటు సతీష్ ప్రియురాలు అశ్వినిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాక్ష్యాలు తారుమారు చేసినందుకు అశ్వినిని అరెస్టు చేశారు. సతీష్ సూరారం గ్రామానికి చెందిన అశ్వినిని ప్రేమించాడు. ఆమెను కలుసుకోవడానికి సతీష్ ఫోన్ చేసినప్పుడు ట్రాక్ చేసి, అతన్ని రప్పించి ఆమె తండ్రి యాదగిరి, మరో ఇద్దరి సహకారంతో హత్య చేసినట్లు భావిస్తున్నారు. సతీష్ దుస్తులను చెరువులో పడేశారు. 25 ఏళ్ల టెక్కీ సతీష్ తండ్రి శంకరయ్య కుటుంబం విషాద సముద్రంలో మునిగిపోయింది. కిడ్నాప్ చేసిన మర్నాడే తన కుమారుడిని హత్య చేసి ఉంటారని శంకరయ్య అంటున్నాడు.












Click it and Unblock the Notifications