ఉప ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి, భారీ భద్రత

మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్‌లో మూడు ప్రధాన పార్టీలు రంగంలో ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో లక్షా 95 వేల పైచిలుకు ఓటర్లున్నారు. నియోజకవర్గంలోని 45 గ్రామాలను అతి సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో లక్షా 72 వేల మంది పైచిలుకు ఓటర్లున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. స్థానికంగా వీడియో గ్రాఫర్లు అందుబాటులో లేకపోవడంతో పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి వీడియో గ్రాఫర్లను పిలిపించేందుకు అధికారులు తంటాలు పడుతున్నారు.
వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో నాలుగు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఐదుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోలింగుకు జిల్లా అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది. పోలింగ్‌కు ముందు నాగర్ కర్నూలులో హైడ్రామా చోటు చేసుకుంది. తెరాస మద్దతుతో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పోలీసులు హంగామా సృష్టించారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో కూడా పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కామారెడ్డిలో కూడా పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది తరలి వెళ్లారు. అన్ని నియోజకవర్గాల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ వీడియోలతో ఓటంగు ప్రక్రియను రికార్డు చేయనున్నారు.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications