ఉప ఎన్నికలపై క్రికెట్ ఎఫెక్ట్: పదేపదే ఎన్నికలూ

అదిలాబాద్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉంది. అక్కడి ప్రజలకు మహారాష్ట్ర వారితో సంబంధాలు ఉన్నాయి. దీంతో చాలామంది పెళ్లిళ్ల కోసం మహారాష్ట్రకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. అక్కడి నియోజకవర్గంలో ఈ ప్రభావం పడిందని తెలుస్తోంది. అంతేకాకుండా తెలంగాణ, అభివృద్ధి ఇలా పలు కారణాలు చెప్పి పదే పదే ఎన్నికలు తీసుకు రావడం పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. ఐదేళ్లకోసారి రావాల్సిన ఎన్నికలు పదే పదే రావడంతో ప్రజలు విసిగి పోతున్నారని అంటున్నారు. ఈ కారణంగానే వారు పోలింగ్ కేంద్రానికి రావడానికి విముఖత చూపిస్తున్నారని అంటున్నారు. ఉప ఎన్నికలు జరిగిన ఏడు నియోజకవర్గాల్లోనూ దాదాపు గత సాధారణ ఎన్నికల సమయంలోని ఓటింగ్ శాతం కంటే తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో భారీ ఓటింగ్ జరిగి అత్యధిక మెజార్టీతో గెలుస్తామని భావించిన పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.












Click it and Unblock the Notifications