వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముందే తెలుసు: రాజ్యసభపై కెకె, చిరంజీవికి సూచన

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Keshav Rao
న్యూఢిల్లీ: తనకు రాజ్యసభ పదవి రాదని ముందే తెలుసునని సీనియర్ కాంగ్రెసు పార్టీ నేత కె కేశవ రావు సోమవారం చెప్పారు. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనకు రాజ్యసభ రానందుకు పలువురు తనపై ఉన్న అభిమానంతో ఫోన్లు చేసి విచారం వ్యక్తం చేశారన్నారు. తాను ఎవరి సానుభూతిని కోరుకోవడం లేదని తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంటున్నానని చెప్పారు. తాను పార్టీ నిర్ణయానికి కట్టుబడతానని తెలంగాణపై మాత్రం రాజీ పడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. తనకు కావాల్సింది పదవులు కాదని, తాను ఎప్పుడూ పదవుల కోసం వెంపర్లాడలేదని తెలంగాణ ఇస్తే చాలన్నారు. తెలంగాణ ఆకాంక్షను ముందుకు తీసుకు వెళ్లడమే తన ధ్యేయం అన్నారు. ఏఐసిసి అధినేత్రి సోనియా గాంధీకి తనపై ఏమాత్రం వ్యతిరేకత లేదన్నారు. తెలంగాణ ఇస్తామని మేం ప్రజలకు వాగ్ధానం చేశామని, దానిని నెరవేర్చుకోవాలని అధిష్టానానికి సూచించారు. పాల్వాయి, రాపోలుకు పదవులు రావడం హర్షణీయమన్నారు. తెలంగాణ వారికి ప్రాధాన్యత ఇవ్వడం సంతోషమన్నారు.

రాజ్యసభకు ఎంపికైన వారు తెలంగాణకు సహకరించాలన్నారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణ ఇచ్చి తీరుతుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. తెలంగాణపై కాంగ్రెసు నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోంమంత్రి చిదంబరం చెప్పడం సిగ్గు చేటు అన్నారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. రాజ్యసభ రానందుకు తనకు ఒకింత సంతోషంగానే ఉందన్నారు. తెలంగాణ కోసం నా పోరాటం కొనసాగుతుందని చెప్పారు. నేను తెలంగాణపై తీసుకున్న స్టాండ్ కూడా పదవి రాకపోవడానికి ఒక కారణం కావచ్చనన్నారు. రాజ్యసభకు ఎంపికైన చిరంజీవిని కూడా తాను అభినందిస్తున్నానని అన్నారు. అయితే మా ఆకాంక్షను వారు అర్థం చేసుకోవాలని సూచించారు. మా వాదన కించపరిచే విధంగా మాత్రం చేయకండి అంటూ విజ్ఞప్తి చేశారు.

English summary
Congress senior leader K Keshav Rao demanded High Command on Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X