యుపిలో జీపును ఢీకొన్న రైలు, 15 మంది మృతి

Train Accedent in UP
లక్నో: ఓ జీపును రైలు ఢీకొనడంతో పదిహేను మంది మృతి చెందిన విషాద సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో మంగళవారం చోటు చేసుకుంది. హస్రత్ సమీపంలో మధుర నుండి కాస్‌గంజ్ వెళుతున్న ప్యాసింజర్ రైలు కాపలా లేని లెవల్ క్రాసింగ్ వద్ద ఓ జీపును ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదంలో అక్కడికి అక్కడే పదిహేను మంది మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందిన వారిలో జీపు డ్రైవర్ కూడా ఉన్నాడు. గాయపడిన వారిని దగ్గరలోని అలీగఢ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ సంఘటన ఉదయం ఏడున్నర గంటల సమయంలో మదు రైల్వే స్టేషన్‌కు సమీపంలో జరిగింది. ప్రమాదానికి గురైన జీపులో మొత్తం పదిహేడు మంది ప్రయాణిస్తున్నట్లు స్థానిక పోలీసులు చెబుతున్నారు. రైలు వస్తుండగా జీపు డ్రైవర్ ట్రాక్ దాటేందుకు ప్రయత్నాలు చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. కాగా ముకుల్ రాయ్ రైల్వే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు ఈ ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం. దేశంలో సుమారు 15వేల కాపలా లేని రైల్వే క్రాసింగులు ఉన్నాయని అంచనా. వాటి పైన మంత్రి ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+