వరంగల్: వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఆధిక్యంలో కొనసాగుతోంది. తెరాస అభ్యర్థి టి. రాజయ్య తెలుగుదేశం, కాంగ్రెసు అభ్యర్థులపై ఆధిక్యంలో కనసాగుతున్నారు. మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి రాజయ్య ఆధిక్యంలో ఉన్నారు. రాజయ్య కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి తెరాసలో చేరిన విషయం తెలిసిందే.తెలుగుదేశం అభ్యర్థి కడియం శ్రీహరి, కాంగ్రెసు అభ్యర్థి ప్రతాప్ వెనకబడి ఉన్నారు.