ఉప ఫలితాలపై సోనియా ఆగ్రహం: కావూరి వివరణ

Sonia Gandhi
న్యూఢిల్లీ: రాష్ట్రంలోని ఉప ఎన్నికల ఫలితాలపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికల ఫలితాలపై ఆమె బుధవారం లోకసభలో పార్టీ పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు నుంచి ఆరా తీశారు. ఉప ఎన్నికలు జరిగిన ఏడు స్థానాల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఎక్కువ స్థానాల్లో రెండో స్థానం కూడా దక్కించుకోకపోవడంపై ఆమె విస్మయం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. నెల్లూరు జిల్లా కోవూరు ఫలితంపై కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాస రెడ్డి నివేదిక సమర్పించారు. ఫలితాలను కాంగ్రెసు జాతీయ నాయకులు తేలికగా కొట్టివేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఫలితాలు ఊహించనవేనని ఎఐసిసి అధికార ప్రతినిధి రషీద్ అల్వీ అన్నారు. పైకి తేలిగ్గా కొట్టి పారేయడానికి ప్రయత్నిస్తున్న లోలోన తీవ్రమైన మథనం జరుగుతున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణకు చెందిన కాంగ్రెసు నాయకులు ప్రస్తుత ఫలితాల నేపథ్యంలో మరోసారి తెలంగాణవాదాన్ని గట్టిగా వినిపించేందుకు సమాయత్తమవుతున్నారు. తెలంగాణపై పార్టీ వైఖరిని తప్పు పడుతున్నారు. తెలంగాణ ప్రజలు తమను నమ్మలేదని, తెలంగాణ ఇస్తేనే ప్రజలు నమ్ముతారని రాజ్యసభకు ఎన్నికైన కాంగ్రెసు నాయకుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. సీనియర్ కాంగ్రెసు నాయకుడు కె. కేశవరావు కూడా తీవ్రంగా స్పందించారు.

కాగా, మహబూబ్ నగర్ విజయంతో బిజెపిలో కొత్త ఉత్సాహం నిండుకున్నట్లు అర్థమవుతోంది. బిజెపి జాతీయ నాయకుడు ఎం వెంకయ్య నాయుడు ఈ ఫలితంపై స్పందించారు. రాష్ట్ర రాజకీయాల్లో మహబూబ్ నగర్ ఫలితం నూతన అధ్యాయానికి నాంది అవుతుందని అన్నారు. తెలంగాణకు అనుకూలంగా తాము తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు ఆదరించినట్లు ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. బిజెపితోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని ప్రజలు నమ్ముతున్నారని ఆయన అన్నారు. మతవాదం తమ పార్టీ అభ్యర్థిని గెలిపించిందనే వాదనను ఆయన తోసిపుచ్చారు. తెలంగాణవాదమే తమను గెలిపించిందని ఆయన చెప్పారు. తమ పార్టీ విజయం తెలంగాణపై ప్రజల ప్రబల ఆకాంక్షకు నిదర్శనమని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+