జగన్‌తో పార్టీ శ్రేణులు వెళ్లాయి, ఇక్కడెవరూ లేరు: డిఎల్
State
oi-Pratapreddy
By Pratap
|
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌తో కాంగ్రెసు పార్టీ శ్రేణులు కూడా వెళ్లాయని, కాంగ్రెసు పార్టీని పునర్నిర్మించేవారు లేకుండా పోయారని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి అన్నారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాజీనామా లేఖను పంపించిన తర్వాత ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పార్టీ భవిష్యత్తు కోసమే తాను రాజీనామా చేశానని ఆయన అన్నారు. తనకు మంత్రి పదవి సోనియా గాంధీయే ఇచ్చారని, అందుకే తన రాజీనామా లేఖను సోనియాకే పంపించానని ఆయన అన్నారు.
ఉప ఎన్నికల ఫలితాలపై మేడం సోనియా గాంధీ అసంతృప్తితో ఉన్నారని ఆయన చెప్పారు. వచ్చే ఫలితాలు కూడా ఇలాగే ఉంటే అసమ్మతి పెరగడం ఖాయమని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెసు ఓటమితో యువ శానససభ్యులు అయోమయంలో పడ్డారని ఆయన అన్నారు. ఇప్పటి వరకు తాను ఎవరి మీద కూడా పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయలేదని ఆయన చెప్పారు. తాను సోనియా గాంధీ అపాయింట్‌మెంట్ కోరానని, అపాయింట్‌మెంట్ ఇవ్వగానే వెళ్లి కలుస్తానని ఆయన చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికలప్పటి నుంచి సంభవించిన పరిణమాలను సోనియాకు రాసి లేఖలో పొందుపరిచానని ఆయన చెప్పారు. ఉప ఎన్నికల ఫలితాలను ముఖ్యమంత్రి క్రికెట్‌తో పోల్చడం దురదృష్టకరమని ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి