పాముకాటుతో మావోయిస్టు అగ్రనేత శేషన్న మృతి

గోదావరిఖని ప్రాంతానికి చెందిన శంకర్ 1983లో రాడికల్ విద్యార్థి సంఘం ద్వారా అప్పటి పీపుల్స్‌వార్‌లో చేరారు. ఆ తర్వాత పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఆదిలాబాద్ జిల్లాలో 1990లో అరెస్టు అయ్యాడు. శంకర్‌తో పాటు మరో నలుగురు మావోయిస్టులను వరంగల్ జైలు నుంచి విడిపించుకునేందుకు అప్పటి పీపుల్స్‌వార్ పార్టీ అధికారులను కిడ్నాప్ చేసి వీరిని బయటికి తెచ్చింది. తిరిగి ఉద్యమంలోకి వెళ్లిన శంకర్ ఇప్పటి వరకు పార్టీలో అనేక ప్రాంతాల్లో హోదాల్లో పని చేశాడు. 2005వరకు మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యకలాపాల్లో క్రియాశీలంగా ఉన్న శంకర్ అప్పటి నుంచి దండకారణ్యంలో అనేక బాధ్యతలు నిర్వహించినట్టు తెలుస్తున్నది.
పార్టీలో దళ సభ్యురాలిగా పని చేసే ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ ప్రాంతానికి చెందిన జంగుభాయ్ అలియాస్ కవితను పెళ్లి చేసుకున్నారు. ఆమె రెండేళ్ల క్రితం పోలీసులకు లొంగిపోయింది. ఐదు రోజుల క్రితం చనిపోయిన శంకర్ మృతదేహానికి దండకారణ్యంలోనే మావోయిస్టు దళాలు అంత్యక్రియలు జరిపినట్టు తెలుస్తున్నది. అయితే శంకర్ మృతదేహం కోసం గోదావరిఖనిలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. శంకర్ తండ్రి రాజం సింగరేణి రిటైర్డ్ గని కార్మికుడు.












Click it and Unblock the Notifications