• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

పరకాలపై బిజెపి కన్ను: పోటీపై సందిగ్ధంలో కెసిఆర్?

By Srinivas
|

Kishan Reddy-K Chandrasekhar Rao
హైదరాబాద్: మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో అద్భుతమైన గెలుపుతో భారతీయ జనతా పార్టీలో కొత్త ఊపు కనిపిస్తోంది. అదే ఊపులో త్వరలో జరగనున్న ఉప ఎన్నికలలోనూ పోటీ చేయాలని నిర్ణయించుకున్నది. గత సంవత్సరం డిసెంబర్‌లో తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసి అనర్హత వేటు పడిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం నేత కొండా సురేఖ స్థానాలో పోటీ చేసేందుకు బిజెపి సన్నద్ధమౌతోంది. మ.నగర్‌లో యెన్నం గెలిచిన అనంతరం పార్టీ నేతలు రాజేశ్వర రావు, అశోక్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ పరకాలలో తప్పకుండా పోటీ చేస్తామని చెప్పారు. తెలంగాణ ప్రజలు ప్రాంతీయ పార్టీల కన్నా జాతీయ పార్టీ అయిన బిజెపి పైనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నట్లుగా వారు భావిస్తున్నారు. కెసిఆర్ అసెంబ్లీ స్థానాలు 100కు పైగా గెలిచినా, పార్లమెంటు స్థానాలు మొత్తం గెలిచినా లాభం లేదనే అభిప్రాయానికి ప్రజలు వచ్చారని అందుకే మ.నగర్‌లో మైనార్టీలు అధికంగా ఉన్నప్పటికీ తెలంగాణ అనే ఒకే ఒక్క కారణంతో బిజెపికి పట్టం కట్టారని అభిప్రాయపడుతున్నారు.

ఇదే సమయంలో తెలంగాణలో పార్టీని పటిష్ట పరచాలనే ఉద్దేశ్యంతో బిజెపి ఉన్నట్లుగా తెలుస్తోంది. 2014లో తామే అధికారంలోకి వస్తామని, అప్పుడు ఖచ్చితంగా తెలంగాణ ఇస్తామని బిజెపి బల్ల గుద్ది మరీ చెబుతోంది. దీంతో తెలంగాణ కోసమే తమ పోరాటమన్న కెసిఆర్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత తగ్గినట్లుగా భావిస్తున్నారు. తెరాస కంటే తెలంగాణ ఇస్తామని చెబుతోన్న బిజెపిని గెలిపించడమే ఉత్తమమని ప్రజలు భావిస్తున్నారని బిజెపి అభిప్రాయపడుతోంది. దీంతో తెలంగాణలో పార్టీని పటిష్టం చేసుకోవాలని చూస్తోంది. అందులో భాగంగా వచ్చే ప్రతి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇటీవల చెప్పారు. ఇక నుండి తెలంగాణ పేరుతో రాజీనామాలు చేస్తే మద్దతివ్వమని, పోటీ చేస్తామని హెచ్చరిక జారీ చేశారు కూడా. పరకాల స్థానం నుండి బిజెపి నేత ప్రేమేందర్ రెడ్డిని రంగంలోకి దింపే అంశాన్ని బిజెపి పరిశీలిస్తోంది.

మరోవైపు మ.నగర్‌లో తమపై బిజెపి గెలుపొందడాన్ని టిఆర్ఎస్ జీర్ణించుకోలేక పోతోంది. కొండా సురేఖ స్థానంతో ఖాళీ అయిన పరకాల స్థానంలో తాము పోటీ చేస్తే బిజెపి నుండి మరోసారి ఎదురు దెబ్బ తగులుతుందా అనే సందిగ్ధంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మైనార్టీలు అధికంగా ఉండే మ.నగర్ స్థానంలోనే బిజెపి గెలిచిందని, అలాంటి సమయంలో పరకాలలో అంద వీజీగా కొట్టి పారేయలేమని కెసిఆర్ ఆలోచిస్తున్నారని అంటున్నారు. ఈ స్థానంలో టిఆర్ఎస్ నుండి అభ్యర్థిని బరిలోకి దింపాలా లేక బిజెపి ఇప్పటికే తాము పోటీ చేస్తామని చెప్పినందు వల్ల ఆ పార్టీకి మద్దతివ్వాలా అని ఆలోచిస్తున్నారని అంటున్నారు. పరకాలలోనూ మ.నగర్ పరిస్థితే పునరావృతమైతే కష్టమేనని కొందరు టిఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారట. మ.నగర్‌లో జెఏసి తమకు అనుకూలంగా పని చేయలేదని, జెఏసి లేకుంటే పార్టీకి రాజకీయంగా నష్టమేననే ఆందోళన టిఆర్ఎస్ వర్గాల్లో తాజాగా కనిపిస్తోందని అంటున్నారు. కాగా మాజీ డిఎస్పీ నళిని తాను పరకాల నుండి పోటీ చేస్తానని జెఏసికి లేఖ రాశారు.

English summary
Buoyed by the Mahaboobnagar bypoll victory, the BJP is now aiming at projecting itself as the champion of the Telangana cause, that is a sort of monopoly of the TRS. The party indicated on Wednesday that its next target could be Parkal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X