హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నల్లపురెడ్డి ప్రసన్న గెలిచారు, అనుచరులు ఓడారు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nallapureddy Prasanna Kumar Reddy
హైదరాబాద్: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొవూరు నియోజకవర్గం నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే నల్లపురెడ్డి విజయం సాధించినప్పటికీ ఆయన అనుచరులు, పార్టీ కార్యకర్తలు ఓడిపోయారనే కామెంట్ వినిపిస్తోంది. ఉప ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి నల్లపురెడ్డి గెలుపు, మెజార్టీపై భారీగా బెట్టింగులు కట్టారన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నల్లపురెడ్డికి యాభై వేలకు పైగా మెజార్టీ వస్తుందని తొలుత పార్టీ కార్యకర్తలు బెట్టింగులు కట్టారట. అయితే ఆ తర్వాత క్రమంగా అది తగ్గుకుంటూ ముప్పైవేలు, ఇరవై వేల మెజార్టీకి వచ్చింది. అయితే ఓటింగ్ పూర్తయ్యాక ఓటింగ్ సరళిని చూసి పందెరాయుళ్లు గెలుపుపై ధీమా వ్యక్తం చేసినప్పటికీ మెజార్టీని తగ్గించి బెట్టింగులు కట్టినట్లు వార్తలు వచ్చాయి.

అయితే ఓటింగ్ లెక్కింపు రోజున తొలుత రౌండ్ రౌండ్‌కు నల్లపురెడ్డి మెజార్టీ పెరుగుతుండటంతో పార్టీ వారు ముప్పై వేలు, యాభై వేలు, ఇరవై ఐదు వేలు వస్తుందంటూ పందేలు కట్టారట. కానీ చివరి రౌండ్లలో ఆధిక్యత వచ్చినప్పటికీ అది తగ్గడంతో మెజార్టీ కేవలం 23వేలకు పైగా వచ్చింది. దీంతో నల్లపురెడ్డి మెజార్టీపై పందేలు కట్టిన కార్యకర్తలు భారీగా నష్టాలను చవి చూశారట. టిడిపి అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. జగన్ పార్టీ వారే మెజార్టీపై పందేలు కట్టి కోట్లు నష్టపోయారని వార్తలు వస్తున్నాయని చెప్పడం గమనార్హం.

English summary
The rumors were came out that YSR Congress party followers loose crores of rupees in bettings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X