ఢిల్లీలో కర్నాటకం: యడ్డీ అల్టిమేటం, నో చేంజ్ అని గౌడ
National
oi-Srinivas
By Srinivas
|
న్యూఢిల్లీ/బెంగళూరు: కర్నాటక రాజకీయం హస్తినకు చేరుకుంది. కర్నాటక ముఖ్యమంత్రి సదానంద గౌడ, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప గురువారం న్యూఢిల్లీ చేరుకున్నారు. ఇద్దరూ వేర్వేరుగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. తనకు అరవై ఏడు మంది శాసనసభ్యుల మద్దతు ఉందని ఆయన అధిష్టానానికి హెచ్చరిక జారీ చేశారు. ఏప్రిల్ 2 లోగా తనను ముఖ్యమంత్రి చేయాలని అల్టిమేటం జారీ చేశారు. తనను ముఖ్యమంత్రిని చేసే విషయంపై అధిష్టానం హామీ ఇవ్వకుంటే బడ్జెట్ సమావేశాలపై ప్రభావం పడుతుందని హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. తనకు సిఎంను చేసే అంశంపై ఖచ్చితమైన హామీ కావాలని గడ్కరీతో పట్టుబట్టినట్లుగా సమాచారం.
మరోవైపు ముఖ్యమంత్రి సదానంద గౌడ కూడా నితిన్ గడ్కరీ, పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ పదవుల్లో గానీ, నాయకత్వంలో గానీ ఎలాంటి మార్పులు ఉండవని పార్టీ పెద్దలు హామీ ఇచ్చారని సదానంద గౌడ చెప్పారు. పార్టీ ఆదేశిస్తే పదవి వదులుకుంటారా అని విలేకరులు ప్రశ్నిస్తే అలాంటి ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. ఓ వైపు యడ్డీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేయడం, మరోవైపు సదానంద పార్టీ పదవుల్లో మార్పులు ఉండవని చెప్పడం గమనార్హం.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి
Amid mounting pressure from B S Yeddyurapa for his reinstatement, Karnataka chief minister Sadananda Gowda today met the BJP top brass, including Nitin Gadkari and L K Advani, and said he had been assured that there would be no leadership change.yeddyurappa, sadananda gowda, bangalore, nitin gadkari, karnataka, యడ్యూరప్ప, సదానంద గౌడ, బెంగళూరు, నితిన్ గడ్కరీ, కర్నాటక
Story first published: Thursday, March 22, 2012, 16:33 [IST]