విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వచ్చే ఉప ఎన్నికలు రెఫరెండమే: లగడపాటి

By Pratap
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal
విజయవాడ/ భువనేశ్వర్: వచ్చే ఉప ఎన్నికలు ప్రభుత్వానికి రెఫరెండమేనని కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. రాష్ట్రంలోని 18 శానససభా స్థానాలకు, ఒక లోకసభ స్థానానికి త్వరలో ఉప ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బాధ్యత వహించాలని అనడం సరి కాదని ఆయన అన్నారు. భావోద్వేగం, సెంటిమెంటు కారణంగా ఉప ఎన్నికల ఫలితాలు అలా వచ్చాయని ఆయన అన్నారు. విమర్శలు చేస్తున్నవారు ముందుగా ఎన్నికల ఫలితాలకు బాధ్యత వహించాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశాలు లేవని ఆయన అన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ కుక్కలు చింపిన విస్తరిలా తయారైందని కాంగ్రెసు సీనియర్ నేత మల్లు రవి అన్నారు. పార్టీ సీనియర్ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడడం వల్లనే ఉప ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. రాష్ట్రంలో ఐకమత్యం లేకపోవడం ఓటమికి కారణమని ఆయన అన్నారు. పార్టీ సీనియర్ నాయకులు ఇప్పటికైనా పార్టీ వ్యతిరేక ప్రచారం మానుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా అధిష్టానం చొరవ చూపి నాయకులకు బాధ్యతలు అప్పగించాలని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉందని ఆయన అన్నారు. జగన్ అవినీతిపై మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. తెలంగాణలో పోటీ చేయకుండా వైయస్ జగన్ రాష్ట్రంలో 30కి పైగా పార్లమెంటు సీట్లు ఎలా గెలుస్తారని ఆయన అడిగారు. సీమాంధ్రలో 25 లోకసభ సీట్లు మాత్రమే ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.

English summary
Congress MP Lagadapati Rajagopal said that ensuing bypolls are referendum for government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X