కాంగ్రెసులోకి వస్తేనే జగన్‌కు భవిష్యత్తు: శంకరరావు

ఉప ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహించి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 18 శాసనసభా స్థానాలకు ఉప ఎన్నికలు రాకముందే అది జరగాలని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి - ఇలా ముఖ్యమంత్రులు మారుతూ 1983 పరిస్థితిని తీసుకుని రావద్దని ఆయన అన్నారు. 2014లో కాంగ్రెసు పార్టీయే అధికారంలోకి వస్తుందని ఆయన చెప్పారు. దేశ భవిష్యత్తు రాజకీయ నాయకుడు రాహుల్ గాంధీయేనని ఆయన అన్నారు. లోకసభకు రాష్ట్రంలో ఎక్కువ స్థానాలు వచ్చి, శాసనసభకు తక్కువ స్థానాలు వచ్చే పరిస్థితి ఉందని, 2009 ఎన్నికల్లో ఇదే జరిగిందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications