బైపోల్స్‌పై దృష్టి సారించిన బొత్స, తెలంగాణపై మాట్లాడ్తా

మంత్రులు ధర్మాన ప్రసాద రావు, పార్థసారథి, కొండ్రు మురళితో ఆయన భేటీ అయ్యారు. నరసన్నపేట నియోజకవర్గంపై వారితో చర్చించారు. ఆ తర్వాత మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితోనూ బొత్స భేటీ అయ్యారు. ఏప్రిల్ 12, 13వ తారీఖున బొత్స ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. కాగా అనంతరం ఆయనను మీడియా పలకరించింది. పార్టీ నేతలు డిఎల్ రవీంద్రా రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిలకు బహిరంగంగా మాట్లాడవద్దని తాను సూచించానని బొత్స చెప్పారు. తెలంగాణపై తాను అధిష్టానంతో మాట్లాడతానని చెప్పారు. తెలంగాణ కోసం బలిదానాలు వద్దన్నారు. త్వరలో తేలుతుందన్నారు. పార్టీలో కాంగ్రెస్, పిఆర్పీ అన్న తేడా లేదన్నారు. మంత్రి సి.రామచంద్రయ్యను పిలిచి మాట్లాడతానన్నారు. కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో అభ్యర్థుల ప్రకటన ఆలస్యం వల్లనే తాము ఓడిపోయామన్నారు. 4న శ్రీకాకుళం, 5న పాయకరావుపేట, 6న తిరుపతి పర్యటిస్తానని చెప్పారు.


Click it and Unblock the Notifications